ఒవైసీ బ్రదర్స్ పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
శ్రీరామ నవమి శోభయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పార్లమెంటు ఉభయ సభలో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు పేరుతో ఒవైసీ బ్రదర్స్ లెక్కలేనన్ని ఆస్తులను కబ్జా చేశారని రాజాసింగ్ ఆరోపించారు. అందుకే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కోరారు. మరో వైపు మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి, ఆనవాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.