Andhra Pradesh

దంచికొడుతున్న వానలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గుంటూరు , వైజాగ్ , ప్రకాశం , ఎన్టీఆర్ అనంతపురం , విజయనగరం , కృష్ణా జిల్లాలలో అగకుండా వర్షాలు కురుస్తోండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సత్యసాయి జిల్లా మలుగూరులో ఇంటి పైకప్పు కూలి మూడేళ్ల బాలుడు శ్రీకాంత్ మృతి చెందాడు. మరోవైపు విశాఖపట్నంలో జరుగుతున్న గర్జనకు వర్షం ఆటంకం కలిగిస్తోంది. జోరు వానలోనూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలూ కొనసాగుతూనే ఉన్నాయి.