Home Page SliderTelangana

తెలంగాణాకు మరోసారి రెయిన్ అలర్ట్

తెలంగాణా రాష్ట్రాన్ని ఇప్పుడప్పుడే వర్షాలు విడిచి వెళ్లేలా లేవు. మొన్నటి వరకు తెలంగాణాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నదులు,వాగులు,వంకలు పొంగి పొర్లి..పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా ఈ వరదలకు తెలంగాణాలో పలువురు మృత్యువాత పడ్డారు. అయితే ఇంతటి భీభత్సం సృష్టించిన వర్షాలు మరోసారి తెలంగాణాను వణికించనున్నాయి. కాగా తెలంగాణాలో నేడు,రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఈ రోజు,రేపు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఈ నెల 3,4,5,6 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ బులిటిన్ విడుదల చేసింది. ఈ వర్షాల నేపథ్యంలో తెలంగాణాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని..అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.