Home Page SliderPoliticsTelangana

‘మీరు చేసిన పనే మేం చేస్తే తప్పా రాహుల్‌జీ’…కేటీఆర్

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎక్స్ ద్వారా ఛాలెంజ్ చేశారు. ఇదేం హిపోక్రసీ అంటూ ప్రశ్నించారు. అదానీ-మోదీ బంధంపై మీరు పార్లమెంట్ ముందు టీ షర్టుపై ప్రదర్శన చేస్తున్నారు. అలాగే మేము కూడా మీ అడుగుజాడలలోనే తెలంగాణ అసెంబ్లీ ముందు రేవంత్- అదానీల బంధంపై టీషర్ట్ ధరిస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. మమ్మల్ని ఎందుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోంది అంటూ విమర్శించారు.