రాహుల్ గాంధీ భారత్ పరువు తీస్తున్నారు..
ఇతర దేశాలలో భారత్ పరువు తీసే అలవాటు రాహుల్ గాంధీకి ఎప్పటినుండో ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ మంత్రి ఇలా వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ విధానాలను రాహుల్ ఈ జన్మలో అర్థం చేసుకోలేరని, ఈ సంస్థ భారత విలువలు, సంస్కృతి నుండి పుట్టిందని ఆయన పేర్కొన్నారు. చైనాను రాహుల్ పొగడ్తలతో ముంచెత్తడంపై మరో బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. రాహుల్ చైనా తరపున బ్యాటింగ్ చేస్తున్నారని, భారత న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని విమర్శించారు. కాగా అంతకు ముందు కూడా రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యం గురించి విదేశాలలో విపరీత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.