NewsTelangana

బీజేపీలోకి పీవీ తనయుడు

తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా మాజీ ప్రధాని పీవీ చిన్న కుమారుడు ప్రభాకర్‌రావు టీఆర్ఎస్, బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నారు. పివి గ్లోబల్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తున్న రావుకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇద్దరితోనూ టచ్‌లో ఉన్నారు. ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్ గుండా వెళ్ళినా… నవంబర్ 1న రాహుల్ గాంధీ, పీవీఎన్ఆర్ మార్గ్ గుండా వెళ్లి ఇందిరా గాంధీకి నివాళులు అర్పించడంతో అసంతృప్తి చెందారు. నరసింహారావు విగ్రహాన్ని సందర్శించకుండా వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. పీవీ తనయుడు అసంతృప్తి నేపథ్యంలో… దిగ్విజయ్‌సింగ్‌, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబును ఆయన నివాసంలో కలిసినప్పటికీ, తన మనసులోని మాటను బయటపెట్టారు.


ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు రెండు పార్టీల్లో ఉన్నారు. సురభి వాణి దేవి, సోదరి TRS నుండి MLCగా ఉండగా, మేనల్లుడు N.V సుభాష్ బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. న్యూఢిల్లీలో ప్రభాకర్‌రావుకు కొంత పరిచయాలు ఉన్నందున, బీఆర్‌ఎస్‌ ప్రకటించే సమయంలో కీలక పదవి ఇస్తే బాగుండని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త అయిన ప్రభాకర్ రావు… తండ్రి నుండి రాజకీయ వ్యూహాలను, నైపుణ్యాలను నేర్చుకున్నారు. నెక్లెస్ రోడ్‌లో జరిగిన సంఘటన తర్వాత ప్రభాకర్ రావు పార్టీ తీరుపైనా, రాహుల్ గాంధీ ఆలోచనలపైనా గరంగరంగా ఉన్నాు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతోంది. మునుగోడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు కొందరు టీఆర్ఎస్ పార్టీలోకి, మరికొందరు బీజేపీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామంటూ రెండు పార్టీలు పలువురు నేతలకు ఆఫర్లిస్తున్నాయ్.