Home Page SliderInternationalmovies

“పుష్ప-2 ది రూల్” వినూత్న ప్రచారం

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ని జాతీయనటుడిగా నిలబెట్టిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పుష్ప-2 ది రూల్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్  వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతుండడంతో ప్రచారాన్ని ముమ్మురం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్ టబ్స్, కూల్‌డ్రింక్ క్యాన్స్ అమెరికాలోని థియేటర్స్‌లో ఇవి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి ప్రమోషన్ ఎక్కడా లేకపోవడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ రోజు పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్  ఎదురెదురుగా ఉన్న పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.