NationalTrending Today

“పుష్ప- 2” మరో 100 రోజుల్లో…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప ది రైస్” చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దాని కొనసాగింపుగా రెండో భాగం “పుష్ప ది రూల్ ” వస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. అయితే అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఆశలకు తెర దించుతూ ఈ యేడాది చివరగా అనగా డిసెంబర్ 6న రిలీజ్ అవ్వబోతుందని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అయినందువల్ల ఈ సారి కూడా అలానే అవుతుందా లేదా అని సందేహంగానే ఉంది. కానీ ఆ సందేహాలకు ఇప్పుడు చెక్ పడింది. “పుష్ప-2” మరో వంద రోజుల్లో ఉండనే విషయాన్ని గుర్తుచేస్తూ “ఎవడ్రా ఎవడ్రా నువ్వు ” సాంగ్ వీడియోను మేకర్స్ ట్వీట్ చేసి షేర్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్నా నటిస్తున్నారు.