Andhra PradeshHome Page Slider

తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ వాహనసేవ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ వాహనసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో చినజీయర్ స్వామి, తితిదే న్యాయాధికారి వై.వీర్రాజు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.