Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు నిరసన సెగ

టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో ఉండగా దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదని దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఉద్ఘాటించారు. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు