తీవ్రవాదానికి డబ్బు అందకుండా చేయాలి!
మన దేశం చాలా కాలం క్రితమే తీవ్ర భయాందోళనలను ఎదుర్కొందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దశాబ్దాలుగా, ఉగ్రవాదం, వివిధ పేర్లు, రూపాల్లో, భారతదేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని… దీని వల్ల వేల కొలది విలువైన జీవితాలను కోల్పోయామన్నారు. ఐతే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు… ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కసిగా ఉన్నామన్నారు. ఎలాంటి తీవ్రవాదానికైనా ఒకేరకమైన శిక్ష ఉండాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదం, మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ… ప్రపంచ ముప్పుతో వ్యవహరించేటప్పుడు అస్పష్టమైన విధానానికి చోటు ఉండరాదన్నారు. ఢిల్లీలో ఉగ్రవాద నిరోధక నిధులపై జరిగిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ మంత్రుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ, ప్రపంచం తీవ్రంగా పరిగణించకముందే మన దేశం… ఉగ్రవాదం చీకటి ముఖాన్ని చూసిందని అన్నారు. దశాబ్దాలుగా, ఉగ్రవాదం, వివిధ పేర్లతో, రూపాల్లో, భారతదేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
వేలాది విలువైన ప్రాణాలను కోల్పోయాం, అయితే ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు మోదీ. “ఒకే దాడి కూడా ఒకటి చాలా ఎక్కువ అని మేము భావిస్తున్నాము. ఒక్క ప్రాణం కూడా చాలా ఎక్కువ. కాబట్టి, ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు మేము విశ్రమించమన్నారాయన. ఆఫ్ఘనిస్తాన్‌తో, అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనని పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు ప్రధాని. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. రాజకీయ, సైద్ధాంతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని దుయ్యబట్టారు. అటువంటి దేశాల నుంచి ఖర్చు తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. తీవ్రవాదం దీర్ఘకాలిక ప్రభావం పేదలపై, స్థానిక ఆర్థిక వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉందని ప్రధాని అన్నారు. నిరంతరం ముప్పులో ఉన్న ప్రాంతాన్ని ఎవరూ ఇష్టపడరు. దీని కారణంగా, ప్రజల జీవనోపాధి తగ్గిపోతుందన్నారు. టెర్రర్ ఫైనాన్సింగ్ మూలాన్ని మనం కనుక్కోవాలన్నారు ప్రధాని మోదీ. తీవ్రవాద నిరోధక ఫైనాన్సింగ్‌పై ప్రభుత్వ పరిపాలన ప్రభావంతో పాటు ఆవిర్భవిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై పాల్గోనే దేశాలు, సంస్థలకు ఒక విశిష్ట వేదికను అందిస్తాయని తెలిపింది.