Home Page SliderInternational

జో బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది ఇటలీలో జరగబోయే జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. కాగా వీరిద్దరు గతంలో భారత్‌లో జరిగిన జీ7 సమావేశాల్లో కలిశారు. అయితే ప్రస్తుతం సమావేశం కానున్న వీరిద్దరు సిక్కు వేర్పాటువాదం గురించి చర్చించనున్నట్లు సమాచారం. కాగా ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రుషి సునాక్,ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్,ఇటలీ ప్రధాని జార్జియా మెలోని,ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.