మీకోసం 124 సార్లు బటన్ నొక్కా.. నాకోసం 2 సార్లు బటన్ నొక్కలేరా?
జగన్‌కు ఓటు వేయకపోవడం ప్రతిపక్షాలకు ఓటేయడమంటే దానర్థం స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టవుతుందని.. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలను, పార్టీని కోరారు సీఎం వైఎస్ జగన్. న్నారు జగన్.. ప్రతి ఇంట్లోనూ చెప్పాలన్నారు. ఈ నెల ఒకటో తారీఖును తలుపు తిట్టి ఇంటి దగ్గరే సేవలు అందుతున్నాయన్నారు. ఈరోజు ప్రతిపక్షానికి ఓటేయడమంటే మళ్లీ లంచాలు, మళ్లీ వివిక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రకటించినట్టే అవుతుందని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పాలన్నారు. గ్రామాల్లో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ జగనన్నను మరచిపోరాదన్నారు. మీకోసం 124 సార్లు ఆయన బటన్ నెక్కా… నాకోసం రెండు సార్లు బటన్ నొక్కలేరా అని కోరారు జగన్.

ఇంటికే పింఛన్, డీబీటీ రావాలన్నా అది జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అందుకే జగనే సీఎం కావాలని, మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలని దాని కోసం మన వంతు ప్రయత్నం చేయాలని జగన్ కోరారు. జగన్ మనల్ని, దేవుడ్ని మాత్రమే నమ్ముకున్నాడన్నారు. జగన్ కు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తుల అలవాటు లేదని, అబద్ధాలు చెప్పే అలవాటు లేదని, మోసం చేసే అలవాటు లేదని జగన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండు సార్లు బటన్ నొక్కితే చంద్రముఖి బాధ ఉండదన్నారు. పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా ఉండదన్నారు. చంద్రగ్రహణాలుండన్నారు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని.. టీగ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో డ్రాకునా మాదిరిగా తలుపు తడుతుందని చెప్పారు జగన్.

14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా.. చేసుకునేందుకు ఏదీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏదీ లేదు కాబట్టి పొత్తుల జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతుందన్నారు జగన్. 14 ఏళ్ల సీఎం నేనిది చేశా.. అందుకే నాకు ఓటేయండని చెప్పుకునేందుకు ఏదీ లేదన్నారు. ఈ మధ్య చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారని… వెన్నుపోటు పొడిచేది ఆయనే.. ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారంటూ దుయ్యబట్టారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అని పిలుస్తున్నారని, ప్రజలను కాదని, పార్టీలను పిలుస్తున్నారన్నారు జగన్. దత్తు పుత్రుడిని… రా కదిలిరా అని… వదినమ్మను కమలం పార్టీలో చేరి రా వదినమ్మ అని పిలుస్తున్నాడన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా చేసి రాష్ట్ర పార్టీని వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును కూడా చార్జ్ షీట్ లో పెట్టిన నమ్మకం ద్రోహం చేసిన పార్టీని నువ్వు రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నారని దుయ్యబట్టారు. బాబుకు, దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్ కు ఈ స్టేట్ లో ఈ స్టేట్ కు వారికే సంబంధం లేదన్నారు జగన్. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరన్నారు. వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అన్నారు. వారికి ప్రజలతో పని పడినప్పుడే వారికే ఈ రాష్ట్రం గుర్తుకు వస్తోందన్నారు. ఆయన సైకిల్ తొక్కడని ఇద్దరిని, దానిని తోయడానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నారన్నారు దుయ్యబట్టారు జగన్.