తిరుపతిలో రాష్ట్రపతి గో తులాభారం…
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకున్నారు. మందిరం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వా రాష్ట్రపతి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం గో ప్రదక్షిణ చేశారు. గోవులకు అరటిపళ్ళు, మేత తినిపించి వాటికి నూతన వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గో తులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన రూ 6 వేల రూపాయలను రాష్ట్రపతి గో మందిరం అధికారులకు అందించారు.