UPSC కొత్త చైర్ పర్సన్‌గా ప్రీతి సుదాన్ నియామకం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్ పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా ఈమె 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.అయితే గతంలో ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆమె ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శితోపాటు వివిధ పదవులు నిర్వర్తించినట్లు సమాచారం. ఇటీవల యూపీఎస్సీ నిర్వహణలో అవకతవకలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో యూపీఎస్సీ చైర్ పర్సన్‌గా ఉన్న దీపక్ గుప్తా పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రీతి సుదాన్‌ను యూపీఎస్సీ కొత్త చైర్ పర్సన్‌గా నియమించింది.

