Telangana

ప్రజాభవన్‌లో ప్రజావాణి

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 576 దరఖాస్తులు అందాయి. సాంఘిక సంక్షేమ శాఖ కు సంబంధించి 214, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 78, విద్యుత్ శాఖ కు సంబంధించి 56, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించి 44, పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ కు సంబంధించి 44, ఇతర శాఖలకు సంబంధించి 140 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.