రాజకీయంగా పవన్ కల్యాణ్‌కే నా మద్దతు-చిరంజీవి
లూసిఫర్ కథ ఆధారంగానే గాడ్ ఫాదర్ సినిమా తీశామన్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరంజీవి చేసిన ట్వీట్ పై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు చిరంజీవి స్పందించారు. ఆ డైలాగులు విని ఎవరైనా భూజాలు తడుముకుంటే తాను చేసేదేం లేదన్నారు. భవిష్యత్ లో తమ్ముడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు తన మద్దతుంటుందన్నారు. ఏపీకి అంకితభావం ఉన్న నేత అవసరమని… పవన్ కల్యాణ్‌కు ప్రజలు అవకాశమిస్తారన్నారు. పవన్ కల్యాణ్ నిబద్ధత ఉన్న వ్యక్తి అన్న చిరంజీవి.. అలాంటి వాళ్లు రాజకీయాలు చేయాలన్నారు.

అందుకే పవన్ కల్యాణ్‌కు తన సపోర్ట్ ఉంటుందన్నారు. పరిపాలించే అవకాశం కూడా భవిష్యత్‌లో ప్రజలు ఇస్తారనుకుంటున్నానన్న చిరంజీవి… అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ, నేతలను ఉద్దేశించి డైలాగులు ఏమీ సినిమాలో ఉండవన్నారు. పొలిటికల్ సెటైర్లు వేయాలనుకోలేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్తున్నాననంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని.. వాళ్ల ఇండస్ట్రీకి వచ్చి కథలు అందిస్తే అద్భుతమైన సినిమాలు వస్తాయన్నారు. సినీ నటుల మధ్య హద్దులు చెరిగిపోయాయన్న చిరంజీవి… సల్మాన్ సౌత్ ఇండస్ట్రీకి వస్తామనుకుంటున్నారన్నారు.

