హైదరాబాద్‌కు పోలీస్ కమిషనర్ మెసేజ్..
హైదరాబాద్ ప్రజలకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక మెసేజ్ రిలీజ్ చేశారు. సాయంత్రం కరెక్ట్‌గా 4 గంటలకు మాక్‌డ్రిల్ జరుగుతుందని జీహెచ్‌ఎంసీ ప్రాంతానికి మెసేజ్ వెళుతుందని పేర్కొన్నారు. 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుందని, ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో అవగాహన కల్పిస్తామని సీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మాక్ డ్రిల్‌పై ప్రజలు, వాలంటీర్లు వ్యవహరించాల్సిన తీరుపై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.