Andhra PradeshHome Page SliderNewsPolitics

విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో

ప్రధాని మోదీ నేడు విశాఖకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు. పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. సిరిపురం జంక్షన్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ వరకూ రోడ్ షో నిర్వహించారు. దీనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఏయూలో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై ప్రధాని ప్రసంగిస్తారు. ఏపీలో దాదాపు రూ.2 లక్షల కోట్లు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వాటిని జాతికి అంకితం చేస్తారు.