Home Page SliderTelangana

బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే ప్రజల కోరికలు తీరేవి: ప్రియాంక గాంధీ

మధిర: తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారు.. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే వారి ఆకాంక్షలు నెరవేరేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా శనివారం మధిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రజల బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు తప్పనిసరిగా అమలుచేసే బాధ్యత తీసుకుంటాం. పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భట్టిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ప్రియాంక గాంధీ వేడుకున్నారు. మీ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్‌కు వేసి గెలిపించాలని కోరిన ప్రియాంక గాంధీ.