పీసీసీ చీఫ్ రేవంత్ కాన్వాయ్‌కు ప్రమాదం.. ఢీకొన్న ఆరు కార్లు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్వల్ప ప్రమాదం చోటుచేసుకొంది. రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. 4 కార్లతోపాటు, 2 టీవీ చానెళ్ల కార్లు సైతం దెబ్బతిన్నాయి. కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కార్లలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధులు ఘటనలో గాయపడ్డారు. ఐతే ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన పాదయాత్రను యాథావిథిగా కొనసాగిస్తున్నారు.
