Home Page SliderNational

పవన్ కళ్యాణ్ ఫాన్స్‌కు పండగే పండగ..

పవన్ చిత్రాలలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన గబ్బర్‌సింగ్ మూవీ రీరిలీజ్‌కు సిద్దమయ్యింది. దీనితో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 2012సంవత్సరంలో విడుదలయిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించి పవన్ చిత్రాలలో ప్రత్యేకత సాధించింది. ఈ చిత్రం రీరిలీజ్‌కు పెద్దఎత్తున భారీ బుకింగులతో, ఇప్పటికే టికెట్లు వాయువేగంతో అమ్ముడవుతున్నాయి. సెప్టెంబర్ 1నే ఆదివారం రాత్రి ప్రీమియర్ వేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 సోమవారం ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అప్పట్లోనే రూ.140 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం దబాంగ్‌కు రీమేక్‌గా రూపొందించబడింది. గబ్బర్ సింగ్‌లో పవన్‌కు జోడీగా శృతిహసన్ ఎంతో అందంగా కనిపించారు. సీనియర్ నటి సుహాసిని తల్లిగా నటించి మెప్పించారు. ఈ మధ్య రీరిలీజ్ అయిన మహేశ్ బాబు చిత్రం మురారి వసూళ్లు రూ.5.3 కోట్లను ఈ చిత్రం వసూళ్లు అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు.