home page sliderNational

భారత ఆర్మీపై కాల్పులు ప్రారంభించిన పాక్..

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాక్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులు ఇస్తోందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ అమలులో లేని కారణంగా సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎల్ ఓసి వెంబడి కాల్పులకు పాక్ తెగబడింది. మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. శత్రు సైన్యానికి గట్టిగా భారత ఆర్మీ బదులిచ్చింది. నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.