కిక్కిరిసిన రైళ్లు- గార్డు క్యాబిన్లో ఎక్కిన ప్రయాణీకులు
సంక్రాంతి వస్తోందంటే చాలు అందరూ సొంతూళ్ల బాట పడుతుంటారు. మరి రైలులో వెళ్లాలంటే రిజర్వేషన్ ఉండాలి కదా. ఈ సీజన్‌లో అది దొరకదు. దానికి తోడు రైళ్లలో జనరల్ బోగీలు కూడా తగ్గించేయడంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతకుముందు రైలులో ముందు,వెనుక రెండేసి చొప్పున బోగీలు ఉండేవి. చాలా రైళ్లలో వాటిని తొలగించడంతో ప్రయాణీకులు దివ్యాంగులకు, స్త్రీలకు సంబంధించిన బోగీలలో ఎక్కేస్తున్నారు. కొందరైతే గార్డు క్యాబిన్లలోకి కూడా చొరబడుతున్నారు. సంక్రాంతి సెలవులు ఇంకా ఆఫీసులకు ప్రారంభం కాకముందే ఇంత రద్దీ ఉంటే ఇక పండుగ రోజులలో ఎంత రద్దీ ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సులు, రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ,తిరుపతి, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.