ఆరెంజ్ రీరిలీజ్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆరెంజ్. ఆరెంజ్ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాగా దీనిని నాగబాబు నిర్మించారు. అయితే ఈ సినిమా అప్పట్లో రామ్‌చరణ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా నిర్మాత నాగబాబుకి కూడా ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ దెబ్బతో నాగబాబు మళ్లీ ఇంకొక సినిమాను నిర్మించే సాహసం కూడా చేయలేదు. అంతగా ఈ సినిమా రామ్‌చరణ్‌ను,నాగబాబును తీవ్రంగా నిరాశపరిచింది. అయితే అటువంటి సినిమాను ఇటీవల రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా దాదాపు 13 ఏళ్ల తర్వాత నాగబాబు రీరిలీజ్ చేశారు. కాగా అప్పట్లో భారీ డిజాస్టర్ అయిన సినిమా ఇప్పుడు మాత్రం కలెక్షన్స్‌తో థియేటర్లను షేక్ చేస్తుంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమా రీరిలీజ్‌కు డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో నిర్మాత నాగబాబు ఈ సినిమా రీరిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని సపోర్టింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సినిమా రీరిలీజ్ అనంతరం అభిమానులు ఈ సినిమాపై కొన్ని ఎమోషనల్ వీడియోలు చేశారు. అందులో ఓ వీడియోను నాగబాబు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

