ఆపరేషన్ సిందూర్.. సీఎం కీలక నిర్ణయాలు
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర ఔషధాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.