భారత్‌లో 2వ యాపిల్ స్టోర్ ప్రారంభం..ఎక్కడో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ యాపిల్ ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చేసింది. అయితే ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. కాగా యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ ఎప్పటినుంచే తమ బ్రాంచ్‌ను ఇండియాలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్‌లో ఏకంగా రెండు స్టోర్‌లను ప్రారంభించారు. కాగా ముంబైలో 2 రోజుల క్రితం యాపిల్ మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించిన టిమ్ కుక్. ఇవాళ ఢిల్లీలో రెండో స్టోర్‌ను ప్రారంభించారు.అయితే ఈ బ్రాంచ్‌ను ఢిల్లీలోని సిటీవాక్ మాల్‌లో ఏర్పాటు చేశారు. కాగా ఇందులో 18 రాష్ట్రాలకు చెందిన 70మంది రిటైల్ టీమ్ మెంబర్స్ పనిచేయనున్నారు. ఈ స్టోర్‌ల ప్రారంభోత్సవంలో భాగంగా అమెరికా నుంచి ఇండియాకి చేరుకున్న యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. ఈ క్రమంలో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు టిమ్ కుక్ స్పష్టం చేశారు.