అన్నవరంలో ఆన్‌లైన్ సేవలు
ప్రసిద్ధ అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇకమీదట భక్తులు క్యూలైన్లలో, వ్రతాల కోసం, దర్శనాల కోసం పడిగాపులు కాయనక్కరలేదు. సత్యనారాయణస్వామి వ్రతాలు, ప్రసాదాలు, కాటేజిలు, కళ్యాణమండపాలు ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ స్వామివారి కళ్యాణాలనికి, వ్రతాలకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూంటారు. నిరంతరాయంగా వ్రతాలు జరుగుతూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం www.aptemples.ap.gov.in ను సందర్శించాలి. అన్నవరంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరమల, సింహాచలం, మహానంది, ఇంద్రకీలాద్రి, వంటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ దేవాలయాల సేవలను కూడా ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంవారిది మాత్రం ప్రత్యేక వెబ్‌సైట్ ఉంది.

