Home Page SliderNational

ఒకప్పుడు అన్‌సోల్డ్..మరి ఇప్పుడు రికార్డ్ ప్రైజ్

నేడు జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఒక్కొక్క ప్లేయర్ రికార్డ్ ధర వలుకుతూ అందరినీ ఆశ్చర్యానికీ గురి చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన వేలంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ రికార్డ్ ధర పలికారు. కాగా CSK ఏకంగా రూ.14 కోట్లు వెచ్చించి డారిల్ మిచెల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆయన గతంలో జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. అయితే  అప్పుడు ఆయనను బేస్ ప్రైజ్‌కు కొనేందుకు కూడా ఎవరు ఆసక్తి చూపలేదు. కనీసం రెండో రౌండ్‌లో కూడా అతడిని ఎవరు పట్టించుకోలేదు. కేజీయఫ్‌ ఫేమస్ డైలాగ్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే రీతిలో మిచెల్ ఇటీవల జరిగిన ఆటలో అటు బ్యాటింగ్,ఇటు బౌలింగ్‌లో అదరగొట్టాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో కూడా మిచెల్ సెంచరీల మోత మోగించాడు. దీంతో ఇప్పుడు జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసింది.