Home Page SliderNational

ఓలా పనైపోయిందా? ఢమాల్ ఢమాల్ అంటున్న ఎలక్ట్రిక్ బైక్ షేర్లు

ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ₹ 90 దిగువకి పడిపోయింది. టూవీలర్లలో లోపాలు, సోషల్ మీడియా వేదికగా కస్టమర్ల విమర్శలతో కంపెనీ వాల్యూ పడిపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్ గత ట్రేడింగ్ సెషన్ నుండి ఇప్పటి వరకు 8.5 శాతం పడిపోయింది. ₹ 76తో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించన ఈ కంపెనీ షేర్ వాల్యూ ఒకానొక సమయంలో ₹ 157.40 కూడా చేరుకుంది. ఆల్ టైమ్ హైని తాకిన తర్వాత, కంపెనీ షేరు దాదాపు 42-43 శాతం దిగువన ట్రేడవుతోంది. మార్కెట్‌లో పోటీదారులు ఎక్కువ కావడం. ఓలా ఫ్లాగ్‌షిప్ S1 సిరీస్ EV స్కూటర్ హార్డ్‌వేర్ సరిగా పనిచేయకపోవడం, సాఫ్ట్‌వేర్ లోపం, విడిభాగాలు సమస్యలతో, వందలాది మంది వినియోగదారులు లబోదిబోమంటున్నారు. బాధితులు గత నెలలో కర్ణాటకలోని దాని షోరూమ్‌ను తగులబెట్టారు. నివేదికల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ నెలకు దాదాపు 80,000 ఫిర్యాదులను అందుకుంటుంది.