రేణిగుంటలో నగ్న, క్షుద్రపూజల వ్యవహారం బట్టబయలు -నిందితుడు అరెస్టు
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతగా ముందుకు పరుగులు పెడుతున్నా ఇంకా మూఢనమ్మకాలు కొందరిలో వేళ్లూనుకుపోయి ఉన్నాయి. ఇలాంటి సంఘటనే తిరుపతి జిల్లా రేణికుంట మండలంలో జరిగింది. చేతబడి జరిగిందనే అపోహతో హైమావతి అనే మహిళ సుబ్బయ్య అనే వ్యక్తిని సంప్రదించింది. ఈ వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినవాడిగా చలామణీ అవుతున్నాడు. క్షుద్రపూజలు చేస్తానంటూ ఆమెను నమ్మించాడు. మాంత్రికుడి అవతారం ఎత్తి, ఇరవై వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. ముగ్గు వేసి, ఆమెను ముగ్గులో దింపాలనుకున్నాడు. పూజ ప్రారంభించి, ఆమెను ముగ్గులో నగ్నంగా కూర్చోవాలంటూ కండిషన్ పెట్టాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచార ప్రయత్నం చేశాడు.

దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతి టీడీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ సుబ్బయ్య. అతనిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అతనిపై ఐపీసీ 354,420,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని గత చరిత్రపై ఆరా తీయసాగారు పోలీసులు. అయితే ఇది రాజకీయ కుట్ర అంటూ స్థానిక టీడీపీ నేతలు సపోర్టు చేస్తున్నారు. వైసీపీ నేతల పథకం ప్రకారమే సుబ్బయ్యను ఇరికించారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో ఈ విషయం రాజకీయంగా, సామాజికంగా సంచలనం రేపుతోంది.