News

ఈనెల ఒకటో తారీఖు కాదు.. మూడో తారీఖు పింఛన్ల పంపిణీ

నెలనెల ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల లోపు పింఛన్ల పంపిణీ చేస్తూ ఏపీ సర్కారు పేదలకు ఎంతో మేలు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత నేరుగా పింఛన్లను అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటోంది. ఐతే వచ్చే నెల పింఛన్లను ఏప్రిల్ 3వ తేదీన పంపిణీ చేయనున్నట్టు సమాచార మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఏప్రిల్ ఒకటిన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ. 2500 నుంచి రూ. 2750 కి జగన్ సర్కారు పెంచింది. అవ్వా, తాతలకు ఇస్తున్న పింఛన్‌ను క్రమంగా మూడు వేల రూపాయల వరకు తీసుకెళ్తామని జగన్ అనేక కార్యక్రమాల్లో చెబుతూ వస్తున్నారు.