మా జోలికొస్తే అణుబాంబులేసేస్తాం-కిమ్ వార్నింగ్
ఉత్తరకొరియా అణు దాడిని నిరోధించడానికి అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. అణ్వాయుధ దేశంగా హోదాను “తిరుగులేనిది” అని ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్యాంగ్యాంగ్ తన భూభాగంలో కోవిడ్ -19 వ్యాప్తికి సియోల్‌ను నిందించింది. అంతే కాదు ఈ సంవత్సరం రికార్డు సంఖ్యలో ఆయుధ పరీక్షలను నిర్వహించి తన జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తోంది.

పరాయి దేశం నుంచి ప్యాంగ్యాంగ్‌కు ముప్పు ఆసన్నమైతే చూస్తూ ఊరుకోమని ఉత్తర కొరియా అధినేత స్పష్టం చేశాడు. నేరుగా శత్రువులను నాశనం చేయడానికి ఇన్నాళ్లూ అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా అణు దాడిని నిర్వహించడానికి చట్టం ఇకపై దేశాధ్యక్షుడికి అనుమతి లభిస్తోంది. ఈ విషయాన్ని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) తెలిపింది. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టంతో, అణ్వాయుధ దేశంగా మన దేశం తిరిగిలేని శక్తిమంతమైన దేశంగా మారిందని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దక్షిణ కొరియాతో ఎలాంటి యుద్ధంలోనైనా తమ దేశం అణు సామర్థ్యాన్ని రుజువు చేసుకోడానికి సిద్ధంగా ఉందని కిమ్ జూలైలో చెప్పారు. అమెరికా అంటే భయపడేది లేదని… అణ్వాయుధాలను ప్యాంగ్యాంగ్ ఎప్పటికీ వదులుకోదని ఆయన పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలను మొదట వదులబోమని ఎలాంటి నిబంధనలను ఉత్తర కొరియా పెట్టుకోవడం లేదని… అణు నిరాయుధీకరణ మరియు చర్చలు లేనే లేవని ఆయన తేల్చిచెప్పారు.