Home Page SliderInternational

నోబెల్ గ్రహీతైన శాంతికాముకునికి పదేళ్ల జైలు

చట్టం, న్యాయం అనేవి కలికాలంలో ఉన్నాయా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. ప్రపంచ ప్రసిద్ధమైన నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తినే కటకటాలకు పంపింది బెలారస్‌లోన్ ఓ కోర్టు. 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఐన అలెస్ బియాలియాట్ స్కీకి శుక్రవారం నాడు పదేళ్ల జైలు శిక్ష పడింది. అతను బెలారస్ మానవహక్కుల ఉద్యమకారుడు, వియస్నా అనే సంస్థను స్థాపించి బెలారస్ లోని మానవహక్కుల పరిరక్షణకు పాటు పడుతున్నారు. 2020లో అలెగ్జాండర్ లుకషెంకో దేశ అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు దేశమంతా పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ అల్లర్లలో ఏకంగా 35వేల మందిని ప్రభుత్వం అరెస్టు చేశారు. వారిలో బియాలియాట్ స్కీ, ఆయన అనుచరులు కూడా ఉన్నారు.

60 సంవత్సరాల వయస్సున్న బియాలియాట్ స్కీ 21 నెలలుగా జైలులోనే మగ్గుతున్నారు. ఆయనతో పాటు వియస్నా, రంద్రానికి చెందిన మరో ముగ్గురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. వీరంతా పౌరభద్రతకు ముప్పు కలిగిస్తున్నారని, దొంగరవాణాకు పాల్పడుతున్నారని ప్రాసిక్యూటన్ ఆరోపణలు చేసింది. వీరిని కోర్టులో హాజరుపరచగా దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు స్కీ. కానీ కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్షను విధించింది. వీరికి శిక్షలు విధించడాన్ని పాశ్చాత్యదేశాలు ప్రతిఘటిస్తున్నాయి.