ముక్కు టీకాతో నేరుగా ఊపిరితిత్తులకు ఉపశమనం
కరోనా నివారణ కోసం ముక్కు టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఈ నాసల్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవియా తెలిపారు. ఈ వ్యాక్సిన్ శాస్త్రీయ నామం BBV154. నాసికా వ్యాక్సిన్‌పై రెండు రకాల ట్రయల్స్ జరిగాయి. తొలి ట్రయల్ కరోనా రెండు-డోస్ ప్రైమరీ వ్యాక్సిన్‌తో జరుగుతోంది. రెండవది బూస్టర్ డోస్ వంటిది. దీన్నికొవిషీల్డ్, కొవాక్సిన్ తీసుకున్న వారికి ఇస్తున్నారు. దీనికి సంబంధించి మూడు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.

దేశంలోని 14 ప్రాంతాల్లో 3100 మందిపై ట్రయల్స్ జరిగాయి. హలెరోలాగస్ బూస్టర్ డోస్ ట్రయల్స్ 875 మందిపై జరిగాయి. ఈ రెండు ట్రయల్స్‌లోనూ ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదని నిపుణులు పేర్కొన్నారు. శ్వాసకోశ వ్యవస్థలో కరోనాతో పోరాడేందుకు ప్రతిరోధకాలను నాసికా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను సెయింట్ లూయిస్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సహకారంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ తయారు చేసింది.

