మునుగోడుపై నో కామెంట్
తెలంగాణ వివాదాస్పద కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఢిల్లీలో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆమెతో 40 నిమిషాలపాటు జరిగిన చర్చల్లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.. రానున్న ఎన్నికల గురించి మాట్లాడుకున్నామన్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికపై చర్చ జరిగిందా.. ఆ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారా..? అని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సమాచారం. నిన్న రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టారు. ముందస్తు అనుమతి తీసుకునే సమావేశానికి హాజరుకాలేదని వెంకట్ రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. హైకమాండ్ పిలుపునకు స్పందించిన వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలసిన అనంతరం ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.