Home Page SliderTelangana

కాళేశ్వరానికి కేంద్ర అనుమతులు లేవు: జీవన్‌ రెడ్డి

కాళేశ్వరానికి కేంద్ర జలమండలి అనుమతులు లేవని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపణ చేశారు.

రాయికల్: కాళేశ్వరానికి కేంద్ర జలమండలి అనుమతులు లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిన ఘటనపై జీవన్ రెడ్డి స్పందించి మాట్లాడారు.  యేనాడో కట్టిన ప్రాజెక్టు నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్‌పి చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో అంతా నాసిరకం మెటీరియల్ వాడి అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే వారిని కఠినంగా శిక్షించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.