భారత్లో అడుగుపెట్టనున్న నిస్సాన్ గ్లోబల్ కార్లు
జపాన్ కార్ల కెంపెనీ నిస్సాన్ పలు అంతర్జాతీయ స్థాయి SUVలను భారత మార్కెట్లో విడుదల చేసే ప్రయత్నంలో పడింది. దీనికి సంబంధించిన ఆయా మోడల్స్ కార్లు భారతలోని వివిధ రోడ్ల పై ఎలాంటి పని తీరును కనబరుస్తాయో పరీక్షిస్తోంది. మొదటిగా నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్ , జ్యూక్ , ఖష్కాయ్ కార్లను భారత మార్కెట్లోకి తెచ్చే సన్నహాలు చేస్తున్నమని కెంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ , కిక్స్ మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఈ పరీక్ష ప్రక్రియ పూర్తైన వేంటనే తొలుత ఎక్స్-ట్రైయిల్ మోడల్ కారును భారత్కు తీసుకోస్తామని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా నిస్సాన్ కంపెనీ కార్లు భారత్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ , ప్రతి సంవత్సరం 30 లక్షల ప్రయాణికుల వాహనాలు అమ్ముడయ్యే మన మార్కెట్లో దీని వాటా 10 శాతం ఉండటం గమనార్హం.