తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్లోనే ఉందని, విభజన తర్వాతే అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్లా వివిక్ష చూపించట్లేదని స్పష్టం చేశారు.

