డీఎస్సీ 2024లో కొత్త ట్విస్ట్
తెలంగాణ డీఎస్సీ 2024లో కొత్తగా ట్విస్ట్ చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఎంపికైన ఏడుగురు హిందీ పండిట్ టీచర్లను తొలగించారు. ఎందుకంటే వీరికి తగిన అర్హతలు లేవంటూ ఫిర్యాదు వచ్చింది. 1:3 నిష్పత్తిలో వీరు అర్హత సాధించారు. 20 రోజుల పాటు ఉద్యోగం కూడా చేశారు. వీరి అర్హతను సవాలు చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు డీఈవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. వారికి డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని, వారిని నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీనితో వారిని తొలగించారు.