కొత్త ఏటీఎం.. బంగారం వేస్తే డబ్బులొస్తాయ్..
ఏటీఎం అంటే డబ్బులు తీసుకోవడం లేదా డబ్బులు జమ చేయడానికి మనమందరికీ తెలిసిన విషయమే. అయితే.. చైనా షాంఘైలో ఒక కొత్త ఏటీఎం వచ్చింది. మీరు బంగారాన్ని దాంట్లో వేస్తే డబ్బులొస్తాయి. ఆ మెషీన్లో మీరు బంగారం పెడితే దానిని 1200 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరిగించి బరువు, నాణ్యతను బట్టి ఆ రోజు చైనా మార్కెట్ ప్రకారం డబ్బును మీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఇది ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషీన్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.