Home Page SliderNational

రేపు హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

హర్యానా శాసనసభా పక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ రోజు పంచకులలోని పార్టీ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించారు. సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో సైనీని ఎన్నుకున్నారు. దీంతో రేపు ఆయన హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలే జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది.