ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్ సర్కారుతో అమీతుమీకి సిద్ధమయ్యాక రఘురామకృష్ణరాజు ఏపీకి దాదాపు రాలేదు. అయితే ప్రభుత్వం సెక్యురిటీ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన భీమవరం చేరుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భీమవరం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారాయన. తాను జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ అందించిన సాయం మరువలేనన్నారు. రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు.
