బరువు తగ్గడానికి కారణం బ్రాహ్మణి-నారా లోకేశ్
యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో దూసుకెళ్తున్న టీడీపీ యువనేత నారా లోకేశ్.. ఇవాళ యువతతో ముచ్చటించారు. తిరుపతి అంకుర ఆస్పత్రి విడిది వద్ద హలో లోకేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత వేసిన అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లోకేశ్ కొంచెం ఫ్యాట్‌గా ఉన్నారని అందరూ భావించేవారు. కానీ ఆయన గత కొద్ది రోజులుగా బాగా లైట్‌గా కన్పిస్తున్నారు. గెటప్ సైతం పూర్తిగా మార్చేశారు. అయితే తాను భారీగా బరువు తగ్గడానికి గల కారణాలను వివరించారు లోకేశ్. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండటానికి కారణం బ్రాహ్మణి అన్నారు.
కరోనా సమయంలో రెండేళ్లు దొరికిపోయానన్నారు. గతంలో ఏదంటే అది తినేవాడినన్నారు. పొద్దిన్నే లేపి పరిగెత్తించి డైట్ మొత్తం కంట్రోల్ చేయించిందన్నారు. అలవాటైపోయి… విపరీతమైన సెల్ఫ్ డిసిప్లెయిన్ వచ్చిందన్నారు. ఐతే కొన్నిసార్లు పాదయాత్రలో చీటింగ్ చేస్తున్నానన్నారు. ఐతే బ్రహ్మణి మంచి సిస్టమ్ పెట్టిందన్నారు. నేను ఏం తిన్నా ఆమెకు తెలిసిపోతుందన్న సీక్రెట్ చెప్పేశారు. డైరెక్ట్‌గా వాట్సాప్ మేసేజ్ పెట్టి… ఈ రోజు బాగానే తిన్నావు.. రేపు తినొద్దు… చాలా నడవాలని బ్రాహ్మణి చెప్తుందన్నారు. సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఈజ్ బ్రహ్మణి అంటూ లోకేశ్ అసలు విషయాన్ని చెప్పేశారు.
