మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్లోకి మైనంపల్లి హన్మంతరావు
బీఆర్ఎస్ రెబల్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోబోతున్నట్టుగా ప్రకటించారు. ఇవారమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. మైనంపల్లి నివాసానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతానన్నారు. మెదక్ నియోజకవర్గంలో తన కుమారుడికి అనుకూలంగా సర్వేలున్నాయన్నారు. సర్వే రిపోర్ట్ సానుకూలంగా ఉంటే తండ్రి, కొడుకులకు టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఆయన తెలిపారు.