నా ఫోన్‌నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
తెలంగాణ: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో నాపై నిఘా పెట్టింది. నా ఫోన్‌నూ ట్యాప్ చేయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.