NewsTelangana

నా పార్టీ గుర్తింపు రద్దు కాలేదు.. జస్ట్ నోటీసులిచ్చారంతే…

కేఏ పాల్ ఏది చేసిన సంచలనమే. ఆయన ఫాలోయింగ్ అలా ఉంటుంది మరి. పొలిటీషియన్లకు తక్కువ… సినిమా స్టార్లకు ఎక్కువ అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. ఇటీవల ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దయ్యిందంటూ వచ్చిన వార్తలతో ఆయన కంగారుపడ్డారు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఢిల్లీ బాటపట్టారు. ఐతే ప్రజాశాంతి పార్టీ ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు కాలేదని… ఆ పార్టీ తరపున ఉన్న వాహనాలను నేటికీ వినియోగిస్తున్నామన్నారు. కావాలని కొందరు ప్రజాశాంతి పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారవి… అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు కేఏ పాల్. పార్టీ ఇనాక్టివ్‌గా ఉందని మాత్రమే ఈసీ నోటీసులు ఇచ్చిందని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తోందని… హెలికాప్టర్ గుర్తుతో పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈసీకి విజ్ఞప్తి కూడా చేశామన్నారు. ఎన్నికల సంఘం కోరిన అన్ని పత్రాలను సబ్మిట్ చేస్తామని.. పార్టీ పై సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగ యువతకు పార్‌పోర్ట్‌తో సహా అమెరికా వీసాలు ఇప్పిస్తానన్నారు పాల్.