NationalNews

మై డియర్‌ చిరు ఐలవ్యూ… వీడియో వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం `గాడ్‌ ఫాదర్‌’ గ్రాండ్‌గా రీలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద  సందడి చేస్తోంది. సినిమా హిట్‌ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఒక వీడియో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ` మై డియర్‌ చిరు గారు ఐలవ్యూ. `గాడ్‌ ఫాదర్‌` సినిమా బాగా ఆడుతోందని విన్నా. మీకు అభినందనలు. ఆ దేవుడి ఆశీస్సుల మీకు ఉంటాయి. వందేమాతరం` అని వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ మసూద్‌ భాయ్‌ అనే కీలక పాత్రలో నటించారు. తనదైన శైలిలో అదరగొట్టారు. ఇద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్‌గా నిలిచాయి.