Home Page SliderTelangana

పూనమ్ కౌర్ ఎమోషనల్.. నాది తెలంగాణానే… పంజాబీని కాను..!

సీని నటి పూనమ్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పుట్టింది తెలంగాణలోనే కానీ పంజాబీ అమ్మాయి అంటున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. తాను తెలంగాణ బిడ్డనని అన్నారు. మీ అందరిలా నేను తెలంగాణలోనే పుట్టానంది. మతం, తన రాష్ట్రం నుంచి వేరు చేయోద్దంది. తనను… తెలంగాణ నుంచి వేరు చేయాలని చూస్తున్నారంది. సిక్కు కుటుంబం నుంచి వచ్చానని తనను తక్కువగా చూడొద్దని విజ్ఞప్తి చేసింది. రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పూనమ్ కౌర్ పాల్గొంది. సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఖుష్బూ, వివిధ రంగాలకు చెందిన మహిళా నిపుణులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై అవార్డులు అందజేశారు.