Home Page SliderTelangana

మీడియా ముసుగులో గంజాయి తరలింపు..

మీడియా ముసుగులో నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. కారుకు ప్రెస్ స్టిక్కర్ తగిలించుకుని గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు అధికారులు ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ చెక్ పోస్ట్ వద్ద తనీఖీలు చేపట్టారు. భద్రాచలం నుంచి బూర్గంపాడు వెళ్తున్న కారును తనిఖీ చేయగా 80 కేజీల గంజాయి లభ్యమైంది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన వ్యక్తులు బూర్గంపహాడ్ మండల విలేకరులు కావడం గమనార్హం. పట్టుబడిన గంజాయి విలువ రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.